[ad_1]
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయం పై కీలక మంత్రాంగం సాగుతోంది. కేంద్రం కేబినెట్ ప్రక్షాళన.. బీజేపీ లోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించబడతాయి. ఇదే సమయంలో దక్షిణాదికి ఈ సారి ప్రాధాన్యత దక్కనుంది. తెలంగాణ, ఏపీ నుంచి కేబినెట్ లో కొత్తగా అవకాశం దక్కనుంది. ఇక.. బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కీలక బాధ్యతలు దక్కేలా ఢిల్లీ వర్గాల సమాచారం.
కేంద్ర కేబినెట్.. బీజేపీ నాయకత్వంలోనూ మార్పుల దిశగా కీలకం. తెలంగాణ.. ఏపీలో బీజేపీ పట్టు పెంచుకునే విధంగా కొత్త నిర్ణయాలకు సిద్దమైంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో ఏపీ.. తెలంగాణకు ప్రాధాన్యత దక్కనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఏపీలో ప్రస్తుతం టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీ నుంచి ఒకరు మంత్రులుగా ఉన్నారు. వీరిలో రామ్మోహన్ నాయుడను వియాన యాన శాఖకు మార్పు చేయాల్సిన శాఖ సమాచారం. సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసానికి స్వతంత్ర శాఖ దక్కనుంది. దీంతో.. ఏపీ నుంచి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీ బీజేపీ ఎంపీల్లో మరొకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు కోరారు.

ఇక, రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి ఈసారి కీలక బాధ్యతలు దక్కడం ఖాయమని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని చెబుతున్నా... లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందని పార్టీ నేతల అంచనా. గతంలో యూపీఏ-1 , యూపీఏ-2 ప్రభుత్వాల హయాంలో పురందేశ్వరి ఏకంగా పదేళ్ల పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి , వాణిజ్య-పరిశ్రమల శాఖలకు సహాయ మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మహిళను లోక్ సభ స్పీకర్ గా నియమించాలి అని నిర్ణయించే.. పురందేశ్వరి పేరు పరిశీలించే ఛాన్స్ ఉందని సమాచారం. లోక్ ప్రస్తుతం ఉన్న సమీకరణల్లో ఓం బిర్లాను మార్పు చేయకుంటే.. పురందేశ్వరిని డిప్యూటీ లోకసభ స్పీకర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో.. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏపీకి ఖాయంగా మారింది. ఈ పదవి టీడీపీకి దక్కితే.. పురందేశ్వరి కేంద్ర మంత్రి అని పార్టీ నేతల సమాచారం.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird