[ad_1]

మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' రూపొందించిన ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక" (తక్షక). ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ దృఢంగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందించిన "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.." నిర్మాతగా లత గారు కొత్త అయినా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు ఈ సినిమా విజయం సాధించి కుశాల్ రాజు హీరోగా పేరు తెచ్చుకోవాలి, అలాగే మా కృష్ణ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను." అన్నారు.
ప్రొడ్యూసర్ డా. లతా ప్రొరాజు మాట్లాడుతూ.. "మా "తక్షక" సినిమా పోస్టర్ లాంచ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు. సరికొత్త సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలున్న చిత్రమిది. మహాభారత కాలం నుండి నేటి వరకు వేల ఏళ్లుగా జరిగిన సన్నివేశాలు అద్భుతమైనవి నాకు మోరల్ సపోర్ట్ గా మా అన్నయ్య డా.నరేంద్రనాథ్ రాజుకు థ్యాంక్స్ చెప్పాలంటే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. అన్నారు.
కృష్ణ మల్లిడి మాట్లాడుతూ.. "మా "తక్షక" మూవీ ఓపెనింగ్ వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు పోస్టర్ లాంచ్ కూడా ఆయనే చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయి డైరెక్టర్ గా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ చేసి ఒక గొప్ప సినిమా మీకు అందించబోతున్నాం. అన్నారు.
హీరో కుశాల్ డైరెక్టర్ రాజు మాట్లాడుతూ.. "మా మూవీ ప్రతి ఈవెంట్లో సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి థ్యాంక్స్. వినాయక్ గారు మా మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం కోసం నేను, మా టీం అంతా చాలా కష్టపడి పనిచేశాం. మా డైరెక్టర్ విజన్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నా. అన్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird