[ad_1]
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల (ప్రాన్) సాగు అనగా ముందుగా గుర్తుకొచ్చే ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా. రాష్ట్రంలో అక్వారంగం ఎగుమతుల్లో 51 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. ఇందులో సగం వాటా రొయ్యల సాగుదే. ఏటా 4 లక్షల టన్నుల వరకూ రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఓవైపు వేసవి వేడి, మరోవైపు కౌంట్ ధరలు తగ్గిపోవడంతో చెరువులో నుంచి రొయ్య బయటికి తీయలేని పరిస్ధితులు దాపురిస్తున్నాయి. అలాగని చెరువులో ఉంచితే పీహెచ్, వ్యాధుల బెడద పొంచి ఉంటోంది.
రాష్ట్రంలో అక్వారంగం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇందులో రొయ్యల సాగు మరింత కష్టంగా మారిపోతోంది. వేసవి పరిస్ధితులు ఓవైపు, సిండికేట్ ముఠాలు దీనికి కారణమవుతున్నాయి. రొయ్య సాగు చేయాలంటే భారీగా పెట్టుబడి పెట్టక తప్పని పరిస్ధితులు ఓవైపు, అంత పెట్టుబడులు పెట్టినా చివరకు లాభాలు వస్తాయా అంటే అదీ అనుమానమే అన్న పరిస్ధితులు రైతులను కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్ధితులు, వ్యాధులతో పాటు వ్యాపారులు సిండికేట్గా మారి ధరల్ని తగ్గించేస్తే ఎకరానికి లక్ష వరకు నష్టం వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రతీ ఏటా ఈ సీజన్లో రైతులు చెరువుల్లో నుంచి రొయ్యల్ని పట్టి అమ్ముకుంటారు. అలా పట్టకపోతే ఆక్సిజన్ అందక, ఇతర కారణాలు కూడా తోడై అవి చనిపోతుంటాయి. సరిగ్గా ఈ కారణాలే వ్యాపారులకు వరంగా మారుతున్నాయి. భారీగా ధరలు తగ్గించి రైతుల పొట్టకొడుతున్నారు. ఫిబ్రవరిలో 100 కౌంట్ రొయ్యలు రూ270 ఉంటే, ఇప్పుడు అవి కాస్తా రూ.220కి తగ్గిపోయాయి. ఈ నెల మొదటి వారంలో 60 కౌంట్ రూ.310 ఉంటే మే 18కి రూ.295కి, 21కి రూ.280కి తగ్గింది. అలాగే ఒకటి, రెండు టన్నులు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతు కష్టాలు రెట్టింపవుతున్నాయి.

ఓవైపు రొయ్యల రైతులు ధరలు లేక అల్లాడుతున్నా, సిండికెట్గా మారి వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నా ప్రభుత్వం మాత్రం వీరిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సీజన్ లో ఇదంతా మామూలే అన్నట్లుగా ఈ సమస్యను చూస్తోంది. దీంతో వ్యాపారులు మరింత చెలరేగిపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే .. ఇప్పుడు వారిని గాలికొదిలేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. సీజన్ మారితేనే కానీ వీరి కష్టాలు తీరేలా కనిపించడం లేదు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird