Home ఎంటర్‌టెయిన్మెంట్ త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలిత,త్రిష స్కూల్ ఒక్కటే అంటున్న ప్రముఖ హీరోయిన్ – VRM MEDIA

త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలిత,త్రిష స్కూల్ ఒక్కటే అంటున్న ప్రముఖ హీరోయిన్ – VRM MEDIA

by VRM Media
0 comments
త్రిష రాజకీయాల్లోకి రావాలి.. జయలలిత,త్రిష స్కూల్ ఒక్కటే అంటున్న ప్రముఖ హీరోయిన్


రాజకీయాలకి, సినిమాలకి ఉన్న బంధాన్ని దూరం చేయడం అసాధ్యమని రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(విజయ్)మరోసారి నిరూపించాడు. పైగా ఎన్నికల బరిలోకి దిగిన మొదటిసారే ఘన విజయాన్ని అందుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయ్ సాధించిన ఈ అద్భుతమైన విజయం తర్వాత ఇప్పుడు కోలీవుడ్‌లో నటీనటుల పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ వేదికనే సీనియర్ నటి వనితా విజయ్‌ స్టార్ హీరోయిన్ త్రిష(త్రిష)కృష్ణన్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వనిత మాట్లాడుతు త్రిషకి రాజకీయాల్లోకి రావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. పరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా అగ్ర కథానాయికగా కొనసాగుతోంది, 50కి పైగా వైవిధ్యమైన సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. ఇదేమి సామాన్యమైన విషయం కాదు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె సంపాదించుకున్న అపారమైన ప్రసిద్ధ, మానసిక పరిపక్వత ఆమెని ఒక గొప్ప నాయకురాలుగా నిలబెడతారు.

ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది ఊచకోత.. పుష్ప-2 రికార్డులని బ్రేక్ చేస్తుందా?

సమాజంలో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న త్రిష, ప్రజా సేవలోకి వస్తే అద్భుతాలు చేయగలరు. ప్రజల నాడిని పట్టుకోవడంలో, వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో సినిమా రంగం ఇచ్చిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. దళపతి విజయ్ మాదిరిగానే త్రిష కూడా ప్రజల మద్దతుతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించగలదు. దివగంత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చదువుకున్న స్కూల్ లోనే త్రిష కూడా చదువుకుందని వనిత చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. వనిత తెలుగులో చేసిన ‘దేవి’ తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వనిత తెలుగు ప్రేక్షకుల మనసుల నుంచి వెళ్లిపోదు.

2,802 Views

You may also like

Leave a Comment