సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 23
రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ ఏం లేదంటూ ప్రభుత్వ డీకేటి స్థలాలు కనపడితే కేటుగాళ్లు రాత్రి రాత్రికే గృహ నిర్మాణ పనులు చేపట్టి రాజకీయ బులుగు పూసి బడా బాబుల చేత ఫోన్లు చేపించుకోవడం వంటి కార్యక్రమాలపై ముందుంటారు పేదవాళ్లు ఎలా పోతే మాకేంటి అనే రీతిలో నిర్మాణాల పనులు చేపడతారు మండలంలోని శాఖరాజు పల్లి రెవిన్యూ సర్వేనెంబర్ 262 సర్వే నెంబర్ నందు సుమారు ఐదు సెంట్లు స్థలంలో గృహ నిర్మాణా పనులు చేపడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో శనివారం వీఆర్వో హరికృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు చేపడుతున్న వ్యక్తి స్థలానికి సంబంధించిన పత్రాలు మండల తాసిల్దార్ కార్యాలయానికి తీసుకురావాలని పత్రాలు పరిశీలించాక పనులు చేపట్టాలని అంతవరకు నిర్మాణ పనులు నిలిపి వస్తున్నట్లు వీఆర్వో హరికృష్ణ తెలిపారు ప్రభుత్వ స్థలాలలో ఎటువంటి అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపడితే చర్యలు తప్పవు అన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird