Home ఎంటర్‌టెయిన్మెంట్ పెద్ది ఊచకోత.. పుష్ప 2 రికార్డులని బ్రేక్ చేస్తుందా? – VRM MEDIA

పెద్ది ఊచకోత.. పుష్ప 2 రికార్డులని బ్రేక్ చేస్తుందా? – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ఇంకెంత పది అంటే పదే రోజుల్లో పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పెద్ది(peddi)తో తన సత్తా చాటుతున్నాడు. ఆల్రెడీ పెద్ది సూపర్ హిట్ అనే పాజిటివ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో వినిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ రోజు ‘పెద్ది కీ ఆవాజ్” మ్యూజికల్ ఈవెంట్‌ జరుగుతుంది.

గతంలో అల్లుఅర్జున్ “పుష్ప 2″(పుష్ప 2) పాట్నా ఈవెంట్ సృష్టించిన ప్రభంజనం. ఆ ఫంక్షన్ ఫుల్ సక్సెస్ అవ్వడం వలన పుష్ప 2 నార్త్ లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే పెద్ది భోపాల్ ఈవెంట్ కూడా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్‌మార్క్ ప్రమోషన్‌గా నిలిచిపోయి నార్త్‌లో భారీ కలెక్షన్స్ రాబడుతుందా అని ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈవెంట్ కోసం మేకర్స్ ఖర్చు ,ప్లానింగ్ చూసి టాలీవుడ్, బాలీవుడ్ సైతం షాక్ అవుతోంది. భోపాల్‌లోని భేల్ దసరా మైదానంలో సుమారు 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో 1 లక్షకు పైగా జనాన్ని తలపించేలా ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి 4 కోట్ల రూపాయల కేటాయించడం విశేషం. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్ నుండి భోపాల్‌కు చిత్ర యూనిట్, రెహమాన్ టీమ్ కోసం 2 ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్స్‌ని ఏర్పాటు చేశారు. అలాగే భోపాల్ లో ఏకంగా 200 లగ్జరీ హోటల్ రూమ్‌లని బుక్ చేశారు. సాంకేతిక హంగుల కోసం ఇండోర్ నుండి భారీ ఎల్‌ఈడీ ఎక్విప్‌మెంట్, హైదరాబాద్ నుండి ప్రత్యేక లైటింగ్, ముంబై నుండి అత్యాధునిక మ్యూజిక్ సిస్టమ్స్. ఈ ఈవెంట్‌లో ఉపయోగించే రెహమాన్ పర్సనల్ సౌండ్ ఎక్విప్‌మెంట్ విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు కాగా, కేవలం ఒక్క రోజు రెంటల్ కోసమే మేకర్స్ 1 కోటి రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: swayambhu: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సరసన స్వయంభూ.. నిఖిల్ అరుదైన రికార్డ్

దీంతో పుష్ప 2 ని మించి ఫంక్షన్ సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ యూట్యూబ్‌లో కేవలం 24 గంటల్లోనే 101 మిలియన్ల వ్యూస్ సాధించి హిస్టారికల్ రికార్డ్ సృష్టించింది. ఇక నిన్న ప్రోమోతో వచ్చిన ‘హెల్లాల్లో’ పూర్తి స్పెషల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ ఎనర్జీ. బహుశా ఈవెంట్ లోనే రిలీజ్ అవ్వచ్చేమో.


2,801 Views

You may also like

Leave a Comment