Home ట్రెండింగ్ సువేందు మాస్టర్ స్ట్రోక్- జూన్ 1 నుంచి బెంగాల్ లో | పశ్చిమ బెంగాల్ అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ కార్డ్‌లను విడుదల చేస్తుంది – VRM MEDIA

సువేందు మాస్టర్ స్ట్రోక్- జూన్ 1 నుంచి బెంగాల్ లో | పశ్చిమ బెంగాల్ అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ కార్డ్‌లను విడుదల చేస్తుంది – VRM MEDIA

by VRM Media
0 comments
సువేందు మాస్టర్ స్ట్రోక్- జూన్ 1 నుంచి బెంగాల్ లో | పశ్చిమ బెంగాల్ అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ కార్డ్‌లను విడుదల చేస్తుంది


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.

అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. మహిళా సాధికారత, ప్రజా రవాణాను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మహిళలు అన్ని ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా సరఫరా చేయవచ్చు. ఈ మేరకు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

పశ్చిమ బెంగాల్ అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ 1 నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ కార్డ్‌లను విడుదల చేస్తుంది

నోటిఫికేషన్ ప్రకారం, పశ్చిమ బెంగాల్ మహిళలందరూ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. షార్ట్ రూట్, లాంగ్ రూట్లతో పాటు, అన్ని రకాల ప్రభుత్వ బస్సులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు. పథకం అమలుకు డిజిటల్ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. వీటిలో క్యూఆర్ కోడ్, ఫోటో, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. మహిళలు తమ సంబంధిత BDO లేదా SDO కార్యాలయాల ద్వారా ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు ఆధార్, EPIC, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ఇటీవలి ఛాయాచిత్రం, ఇతర ఆమోదిత ఐడీ కార్డులు కూడా సమర్పించాలి. స్మార్ట్ కార్డులు వచ్చేవరకు, మహిళలు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో ఐడి చూపించి ఉచిత ప్రయాణం పొందవచ్చు. తాత్కాలికంగా, కండక్టర్లు ధృవీకరణ తరువాత “జీరో వాల్యూ టికెట్‌లు” లేదా థర్మల్ పేపర్ టికెట్‌లను జారీ చేస్తారు. ఈ ఆర్థిక శాఖ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది అని నోటిఫికేషన్.

2,801 Views

You may also like

Leave a Comment