VRM మీడియా న్యూస్
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మం జిల్లా
తేదీ: 23-05-2026
రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించిన మహమ్మద్ అర్ఫాజ్ అలీ
తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాల్లో సత్తుపల్లికి చెందిన విజినరీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఘన విజయాన్ని సాధించింది. సంస్థ విద్యార్థి మహమ్మద్ అర్ఫాజ్ అలీ రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించి సత్తుపల్లి పేరు రాష్ట్రవ్యాప్తంగా నిలబెట్టాడు.
పేద కుటుంబానికి చెందిన అర్ఫాజ్ అలీ తన కృషి, పట్టుదలతో ఈ ఘనత సాధించగా, ఆయన తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ పర్వీన్ ఫాతిమా ప్రోత్సాహం అందించారు.
సంస్థలో శిక్షణ పొందిన 47 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు జొన్నలగడ్డ రాజు, కంచపోగు గోపాల్ రావు, ఖమ్మంపాటి రామకృష్ణ విద్యార్థులను అభినందించారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird