పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఉమా


(PMDS) ఫ్రీ మాన్సూన్ డ్రై సౌయింగ్ విధానం తో గడ్డి వాటి ఉపయోగాలను రై తు అనుభవాలను తెలుసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచగుడి పల్లి గ్రామ పంచాయతీలోని రాచగు పల్లి గ్రామంలో … పి యం డి ఎస్ ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు శనివారం రాచ గుడిపల్లి లో అరుణ అనే రైతు ఒక ఎకరా పొలంలో (PMDS) అంటే ఫ్రీ మాన్సూన్ డ్రై సౌయింగ్ విధానం తో 30 రకాల విత్తనాలు పొలం లో చల్లడం..పొలం లో ఎటువంటి ఎరువులు వేసుకోకుండా పకృతి వ్యవసాయ జీవామృతం ఘనామృతం వాడి భూమిని సారవంతం చేయడం అలాగే పశువులకు ఎండాకాలం గ్రాసం కొరత రాకుండా పశువులకు పచ్చి మేపూ గా రైతులు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు ఆ పొలాన్ని పరిశీలించడం జరిగింది .ఒంటిమిట్ట మండలం లో ఇప్పటికే 50 ఎకరాలు పీఎండ్స్ విత్తనాలు రైతులు వేసుకున్నట్లుగా,దాదాపు 162 మంది రైతులు ఈ విధానం చేపట్టారని తెలిపినారు. రా చగుడిపల్లి గ్రామ సందర్శనం లో భాగంగా
ఈ రకంగా పశువులకు మేపూ గా వేయడం వల్ల పాలదిగుబడి పెరిగింది,వెన్న శాతం పెరిగింది ,1 లీటర్ పాలు రూ 80 /- వరకు గిట్టుబాటు ధర వస్తున్నది.
దాన,ఎముకల పొడి, కొనే అవసరం తగ్గింది,అలాగే పశువులకు..30 రకాల గింజలతో వేసిన గ్రాసం వేయడం వల్ల పశువులకు
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్, లవణాలు అందుతున్నాయని ,మునగ,అలసంద,పాలకూర, బీర ,సోర్రకాయలు,ఇంటి వంట అవసరం కు వాడుకుంటున్నారని,రైతులు..(పకృతి వ్యవసాయం) ఫార్మర్ మాస్టర్ ట్రైనర్. అన్నపూర్ణ , వెంకటసుబ్బయ్య మనోహర్ రామచంద్రయ్య ఇంటర్నల్ రిసోర్స్ పర్సన్..అరుణ రైతు లు హర్షం వ్యక్తం తెలియజేసినారు.
ఎండలకు పశుగ్రాసం కొరత లేకుండా ప్రతీ రైతు తప్పని సరిగా పీఎండ్స్ విత్తనాలు వేసుకొని పశుగ్రాస కొరతను అధిగమించాలని
పశుసంవర్ధక శాఖ సహాయసంచాలకు Dr. ఉమా రైతులకు సూచించారు.k.j రాణి, VLO, శేఖర్ ,రైతులు పాల్గొన్నారు