ఖమ్మం రూరల్, విఆర్‌ఎం మీడియా | కార్తిక్ | మే 24
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 13వ డివిజన్, ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో అతి ప్రమాదకరంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. నడి రోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సమస్యను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రమాదం చోటుచేసుకునే ముందే సంబంధిత అధికారులు స్పందించి, ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించడం లేదా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

