VRM media అయినవిల్లి భద్రం
జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్, ఐపీఎస్, డీఎస్పీ శ్రీ అష్రాఫ్ అలీ గార్ల ఆదేశాల మేరకు మారేడుమిల్లి సీఐ శ్రీ బి. నరసింహమూర్తి, ఎస్సై కే. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు మారేడుమిల్లి సెంటర్ నందు వాహనదారులతో హెల్మెట్లపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వచ్ఛందంగా వారిచే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరింపజేశారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను అధికారులు వివరించారు.
అంతేకాకుండా వాహనదారులు అందరూ తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి స్టేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు కోరారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird