Home ట్రెండింగ్ భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ బిగ్ షాక్ !! | పర్యాటకులు మరియు అంతర్జాతీయ సందర్శకులకు వీసా మార్పులపై థాయ్‌లాండ్ భారతీయ పర్యాటకులకు పెద్ద షాక్ ఇచ్చింది – VRM MEDIA

భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ బిగ్ షాక్ !! | పర్యాటకులు మరియు అంతర్జాతీయ సందర్శకులకు వీసా మార్పులపై థాయ్‌లాండ్ భారతీయ పర్యాటకులకు పెద్ద షాక్ ఇచ్చింది – VRM MEDIA

by VRM Media
0 comments
భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ బిగ్ షాక్ !! | పర్యాటకులు మరియు అంతర్జాతీయ సందర్శకులకు వీసా మార్పులపై థాయ్‌లాండ్ భారతీయ పర్యాటకులకు పెద్ద షాక్ ఇచ్చింది


అంతర్జాతీయ

-కొరివి జయకుమార్

భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ టూరిస్ట్ డెస్టినేషన్లలో ఒకటైన థాయిలాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు 93 దేశాల పౌరులకు 60 రోజుల ఉచిత వీసా సౌకర్యాలను థాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం భారతీయ టూరిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా లాంగ్ వెకేషన్స్, హనీమూన్స్, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం థాయిలాండ్ వెళ్లే వారిపై ఈ మార్పు ప్రభావం చూపనుంది.

కొత్త వీసా విధానానికి ఆమోదం..

థాయిలాండ్ విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 మే 19న థాయ్ క్యాబినెట్ కొత్త వీసా నిబంధనలకు ఆమోదం. “ఒక దేశానికి ఒకే వీసా విధానం” అనే సూత్రంతో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. విదేశీ పర్యాటకుల ప్రవేశాన్ని మరింత క్రమబద్ధీకరించడం, భద్రతా ప్రమాణాలను పెంచడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని సూచించింది.

పర్యాటకులకు మరియు అంతర్జాతీయ సందర్శకులకు-వీసా-మార్పులను-థాయిలాండ్-తొ-భారతీయ-పర్యాటకులకు-పెద్ద-షాక్ ఇచ్చింది

60 రోజుల ఫ్రీ వీసా ఇక లేనట్టే

ఇప్పటివరకు భారతీయులకు థాయిలాండ్‌లో 60 రోజుల వరకు వీసా లేకుండా ఉండే అవకాశం ఉండేది. అవసరమైతే అదనంగా మరో 30 రోజులు పొడిగించుకునే వీలూ ఉండేది. దీనితో థాయిలాండ్ భారతీయులకు అత్యంత ఆసక్తికరమైన విదేశీ పర్యాటక కేంద్రంగా మారింది. అయితే కొత్త నిబంధనలతో ఆ అవకాశం పూర్తిగా ముగిసింది.

ఇకపై ‘వీసా ఆన్ అరైవల్’ మాత్రమే

కొత్త విధానం ప్రకారం భారతీయ ఇకపై థాయిలాండ్ చేరుకున్న తర్వాత ‘వీసా ఆన్ అరైవల్’ కోసం అప్లై చేయవలసి ఉంటుంది. విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద పాస్‌పోర్ట్, ఫోటోలు, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఫైనాన్షియల్ ప్రూఫ్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వీసా ద్వారా 15 రోజుల వరకు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతి లభిస్తుంది.

పర్యాటకులకు పెరిగే ఇబ్బందులు

ఈ నిర్ణయంతో భారతీయ పర్యాటకులు అదనపు ఖర్చులు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ రోజులు ఉండే ట్రావెల్ ప్లాన్‌లు, డిజిటల్ నోమాడ్స్, బ్యాక్‌ప్యాకర్స్‌పై ఈ మార్పు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్యాకేజీలను మార్చే పనిలో పడ్డాయి.

భద్రతా కారణాలే ప్రధాన కారణం

థాయ్ ప్రభుత్వం తెలిపిన ప్రకారం, అక్రమ వలసలు, వీసా దుర్వినియోగం, భద్రతా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వీసా సౌకర్యాలను కొందరు అక్రమంగా వినియోగిస్తున్న నేపథ్య చిత్రాలను పునర్విమర్శించినట్లు సమాచారం. ఇకపై పర్యాటక ప్రోత్సాహం, భద్రత – వాటికి సమాన ప్రాధాన్యత ఉంటుందని అధికారులు ప్రకటించారు.

వీసా కేటగిరీల్లో భారీ మార్పులు

కొత్త నిబంధనల ప్రకారం:

30 రోజుల వీసా మినహాయింపు దేశాల సంఖ్య 57 నుంచి 54కు తగ్గించారు
మూడు దేశాలకు కొత్తగా 15 రోజుల ప్రత్యేక వీసా విధానాన్ని తీసుకొచ్చారు
‘వీసా ఆన్ అరైవల్’ సంతోషకరమైన దేశాల సంఖ్యను 31 నుంచి కేవలం 4కు పరిమితం చేశారు
ఈ మార్పులు ‘రాయల్ గెజెట్’లో ప్రచురించబడిన 15 రోజుల తర్వాత అమల్లోకి రానున్నాయి
ట్రావెల్ ప్లాన్ చేసేవారికి సూచనలు

థాయిలాండ్ వెళ్లే భారతీయులు ముందుగానే తాజా వీసా నిబంధనలను పరిశీలించాలని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా:

పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఉండాలి
రిటర్న్ టికెట్ తప్పనిసరి
హోటల్ బుకింగ్ ప్రూఫ్ వెంట ఉండాలి
సరిపడా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చూపించాల్సి రావచ్చు

భారతీయ పర్యాటక రంగంపై ప్రభావం?

ప్రతి లక్షలాది భారతీయులు థాయిలాండ్‌ను సందర్శిస్తారు. బ్యాంకాక్, ఫుకెట్, పట్టాయా, క్రాబీ, చియాంగ్ మై వంటి ప్రాంతాలు భారతీయులకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు కొత్త వీసా విధానం వల్ల పర్యాటకుల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రావెల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భద్రతాపరమైన చర్యలతో పర్యాటక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే థాయ్ ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

2,801 Views

You may also like

Leave a Comment