వి ర్ ఎం న్యూస్ కార్తీక్ ఖమ్మం రూరల్ మే 24:


ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద టిప్పర్ లారీని వెనకనుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు TS 28Z 0077 నెంబర్ కలిగిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీని ఢీకొన్నది డ్రైవర్ అజాగ్రత్త వాళ్ళని ఈ ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.
ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులకు అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల జాగర్త, అధికారుల పర్యవేక్షణ లోపం కంటికి కనిపిస్తుంది. కానీ అధికారులు నిర్లక్ష్యం ఇలాగే ఉంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో సెల్ఫోన్ వినియోగించకూడదు అయినా సరే సెల్ ఫోన్లు వినియోగిస్తూ వాహనాలు నడుపుతున్నారు. చిన్న దెబ్బలు గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు అదే పెద్ద ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి, అని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు ఇకమీదటైనా అధికారులు డ్రైవర్ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది పలువురు వాపోతున్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird