[ad_1]
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ, కుర్రకారుడు క్రష్ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో మరోసారి తన అందాల సెన్సేషన్తో సెగలు రేపుతోంది. వెండితెరపై వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా సాంప్రదాయ కేరళ కసవు చీరలో మెరిసి అభిమానులను ఒక్కసారిగా మంత్రముగ్ధులను చేసింది. లేత తెలుపు, క్రీమ్ కలర్ కాటన్ బేస్‌పై మెరిసే గోల్డెన్ జరీ అంచు కలిగిన ఈ క్లాసిక్ కేరళ కసవు చీరకు, ముదురు ఆకుపచ్చ రంగు బ్లౌజ్‌ను జతచేసి పక్కా ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టింది. ఈ అందమైన ఫొటోలకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "ట్రెండ్ కి తగ్గట్టు వెళ్తున్నాను" అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో, ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేరళ ట్రెడిషనల్ లుక్‌లో మీనాక్షి ఎంతో ఒదిగిపోయిందని, ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం ఈ చీరకట్టులో మరింత రెట్టింపైందని నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
1996 మార్చి 5న జన్మించిన హర్యానాలోని పంచ్కులాలో జన్మించిన మీనాక్షి చౌదరి, కేవలం అందాల నటి మాత్రమే కాదు.. విద్యావంతురాలు కూడా. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసి డెంటల్ సర్జన్‌గా అర్హత సాధించారు. ఆ తర్వాత నటన, గ్లామర్ రంగంపై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అసాధారణమైన ప్రతిభతో మయన్మార్‌లోని యాంగోన్లో జరిగిన 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018' అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అదే ఏడాది జరిగిన 'ఫెమినా మిస్ ఇండియా 2018' పోటీలలో 'మిస్ గ్రాండ్ ఇండియా' కిరీటాన్ని దక్కించుకొని, 'మిస్ ఇండియా పేజెంట్' రన్నరప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.
మోడలింగ్‌లో రాణిస్తున్న సమయంలోనే 2019లో హిందీ చిత్రం 'అప్ స్టార్ట్స్'లో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2021లో అక్కినేని హీరో సుశాంత్ సరసన 'ఇచ్చట వాహన'ములు నిలపరాదు' చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, ఆమెకు కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది మాత్రం 'హిట్: ది సెకండ్ కేసు' మూవీ అని చెప్పాలి. ఆ సినిమాలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక 2024 లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయం సాధించింది. అదే ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'మట్కా', కిరణ్ అబ్బవరం సరసన 'లక్కీ భాస్కర్', మరియు విశ్వక్ సేన్ తో 'మెకానిక్ రాఖీ', విక్టరీ వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి వరుస క్రేజీ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది.
ఈ ఏడాది 'అనగనగా ఒక రాజు' చిత్రంతో మరో భారీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని, టాలీవుడ్లో లక్కీ 'సంక్రాంతి హీరోయిన్'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి లైనప్ చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య సరసన క్రేజీ ప్రాజెక్ట్ 'వృషకర్మ' సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సరసన 'కార్తీ 30' చిత్రంలోనూ, బాలీవుడ్లో ప్రతిష్టాత్మక 'ఫోర్స్ 3' చిత్రంలోనూ నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇలా ఒకవైపు వరుస భారీ ప్రాజెక్టులతో డేట్స్ ఖాళీ లేనంత కాలం గడుపుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అదిరిపోయే ట్రెడిషనల్ ఫోటోషూట్లతో అభిమానులకు నిరంతరం టచ్‌లోనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird