రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 29
టిడిపి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఏర్పడిందని టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు తెలిపారు మండలంలోని, మాధవరం, 1 ఎస్ కే నగర్ గ్రామం లో తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడంపై కార్యకర్తల్లో కొత్త ఒరవడి ఏర్పడిందని మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మహానాడు విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటామని కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదని తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ కోసం క్రియాశీలకంగా కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో విజయవంతంగా ముందుకు వెళ్తుందని మహానాడు విజయవంతం కావడంతో వైసిపి పాలకులకు కంటి నిండా నిద్ర లేకుండా పోతుందని మహానాడు కార్యక్రమాన్ని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపెందుకు వైసిపి కుట్ర పడి విష ప్రచారం చేసిందని పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టి మహానాడు ను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల్లో కూటమి విజయం సాధిస్తుందన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird