మహానాడులో మూడు తీర్మానాలు
జ్యోతి , ఖాదర్ బంగ్లా పెన్నా నది పై వంతెన నిర్మాణం
సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 29
అటవీ శాఖ ఫారెస్ట్ చెక్ పోస్ట్ తొలగింపు
సిద్ధవటం హై లెవెల్ వంతెన పై, త్రాగునీరు పైపులు నిర్మాణం
మహానాడు విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి నేతలు
మహానాడు, ఒక పండుగ వాతావరణం లో విజయవంతం కావడం కార్యకర్తల కృషి పట్టుదల వల్ల విజయవంతమైందని టిడిపి నేతలు తెలిపారు మండల కేంద్రమైన సిద్ధవటం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్/క్లస్టర్ ఇంచార్జ్ దారపునేని రాజా నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం టిడిపి నేతలు మాట్లాడుతూ మే, 27,28 న రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆదేశాలతో గ్రామ శివారులోని ఉషా గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడానికి కార్యకర్తల కృషి పట్టుదల వల్లే విజయవంతమైందని తెలిపారు ప్రతి ఏటా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు వేడుకలు జరుపుకోవడం ఆనువాయితీగా వస్తుందని ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో పార్టీ బలోపేతం చేసి కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తాతకు తగ్గ మనవడిలా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పార్టీ కార్యకర్తలకు ఆయన సేవలు అందించడం చరిత్రలో నిలిచిపోతాయని మహానాడు కార్యక్రమానికి ఊరు వాడల టిడిపి కార్యకర్తలు తరలివచ్చి మహానాడు విజయవంతం చేయడం శుభ పరిమాణమని తెలిపారు సిద్ధవటం మండలంలోని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీ, జ్యోతి, ఖాదర్ బంగ్లా పెన్నా నదిపై వంతెన నిర్మాణ పనులు, సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ తొలగింపు , హై లెవెల్ వంతెనపై ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు కొరకు మహానాడులో తీర్మానం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ దారపునేని రాజా నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు చెంచయ్య నాయుడు, టిడిపి మండల మాజీ కన్వీనర్ మామిడి సుబ్బారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి గంగా నంద రెడ్డి, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు నాగభూషణం, పార్ల శ్రీనివాసులు, బత్తల, వెంకటసుబ్బయ్య ఈశ్వరయ్య తదితర మండల టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird