[ad_1]
వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
పెరుగుతున్న బంగారం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు, ఇన్వెస్టర్లకు గత వారం మార్కెట్ పెద్ద ఊరటనిచ్చింది. ఎప్పుడూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయే పసిడి, వెండి ధరలు గత వారం ఒక్కసారిగా భారీ తగ్గుదల దిశగా అడుగులు వేశాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలడంతో.. అసలు బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా రేట్లు ఎందుకు పడిపోయాయో నిపుణుల విశ్లేషణ ఎలా ఉంది.
దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX) లో గత వారం పూర్తిగా ప్రతికూల వాతావరణం నడిచింది. అమ్మకాల ఒత్తిడి తట్టుకోలేక ధరలు భారీగా పతనమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్ (Comex) లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ పసిడి ధర ఔన్స్‌కు 5 శాతం (227.7 డాలర్లు) తగ్గి 4,365 డాలర్లు, వెండి 9 శాతం క్షీణించి 69.10 డాలర్ల వద్ద నిలిచాయి. పారిశ్రామిక లోహాల డిమాండ్ పడిపోవడంతో వెండిపై తీవ్ర ప్రభావం పడిందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి ప్రణవ్ మెర్ పేర్కొన్నారు.
ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భారీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి:
రాబోయే రోజుల్లో బంగారం ధరలు కోలుకోవడం అంత సులువు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో వెలువడుతున్న చైనా, అమెరికా వాణిజ్య, ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) మార్కెట్ దిశను డిసైడ్ చేస్తుంది. వీటికి తోడు భారతదేశ సంస్థ ధరల సూచీ (C) నివేదిక, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర గనుక ఔన్స్‌కు 4,400-4,500 తక్కువగా ఉంటే, రానున్న రోజుల్లో పసిడి మరిన్ని నష్టాలను చవిచూసే అవకాశం ఉందని, కొనుగోలుదారులు కాస్త అప్రమత్తంగా ఉండి మార్కెట్ స్థిరపడ్డాక నిర్ణయం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird