
డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే సినీ ప్రియుల కోసం ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చిన ఒక విలక్షణ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. థియేట్రికల్ విడుదల సమయంలో పెద్దగా సంచలనాలు సృష్టించలేకపోయాయి, ప్రస్తుతం ఓటీటీ వేదికగా ఈ చిత్రం భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
రత్న కుమార్ దర్శకత్వంలో యువ నటుడు విధు, టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ’29’. ఒక స్వచ్ఛమైన, ప్రాక్టికల్ ప్రేమకథగా రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. 30 ఏళ్లకు చేరువవుతున్న సత్య అనే ఓ సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. తన కెరీర్ పట్ల స్పష్టత లేకపోవడం, భవిష్యత్తు గురించి ఆందోళనలు, సమాజం మరియు కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లతో అతడు మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అతని జీవితంలోకి వీజీ (ప్రీతి అస్రాని) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, సత్యలోని అభద్రతాభావం వల్ల ఎలాంటి మలుపులు తిరిగింది దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.
నేటి తరం యువత రియల్ లైఫ్‌కి చాలా సన్నివేశాలు ఉన్నాయి. కేవలం ఒక రొమాంటిక్ డ్రామాగానే కాకుండా, మారుతున్న కాలంలో బంధాల మధ్య వచ్చే ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్‌ను చాలా సహజంగా చూపించారు. ఈ చిత్రంలో బాలు మహేంద్రన్, అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.
ఈ సినిమాకు ఓటీటీలో లభిస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. IMDbలో కూడా ఈ అద్భుతమైన రేటింగ్ దక్కడం విశేషం. ముఖ్యంగా కెరీర్ మరియు ప్రేమ మధ్య నలిగిపోయే ప్రతి అబ్బాయి ఖచ్చితంగా చూడాల్సిన క్లాసిక్ ఫిల్మ్ ఇదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు వ్యూస్ సాధించేలా ఉంది. థియేటర్లలో మంచి చిత్రాలను మిస్ అయ్యామని ఫీలయ్యే ఓటీటీ ప్రియులకు, ఈ వీకెండ్‌లో చూసేందుకు ’29’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.