Vrm media ప్రతినిధి సుబ్బారావు R R జిల్లా

తీరని ఆకలి రాజ్యంలో
తిరుగు బాటును చేసింది
ఆత్మ గౌరవంతో పేదరికాన్ని
ఓడించేందుకు నడుం కట్టే
మరో ఝాన్సీలక్ష్మీ బాయి..!
కన్నీళ్లను చెమటలుగా చేసి
చిన్నారిని నడుముకు కట్టి
వొంగుని మాగాణి పొలంలో
వరినాట్లు వేసే వీర నారీమణి..!
కుటుంబ వ్యవస్థలు కుంటు పడగా
పేదింటి బతుకులు ఒంటరాయే
ఇంటి దగ్గర చంటి పిల్లలకు
సంరక్షకులు పూర్తిగా కరువాయే…!
నవమాసాలు మోసి పురిటి నొప్పులతో
నవజాత శిశువును కన్న మహిళకు
బిడ్డను మోస్తూ పనులు చేయటం
చెడ్డ బరువేమీ కాదు ఆ తరుణికి..!
చంటి శిశువును నడుముకు చుట్టి
బురదలో బువ్వ మొక్కలను నాటే
ఏడు పదుల స్వర్ణ భారతాన అతివ
వికసిత భారతంలో దారిద్య్రం పోయి
చిరు మందహాసాలు చిందేది ఎప్పుడో…?!
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird