[ad_1]
టాలీవుడ్ యువ కథానాయకుడు, ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన తదుపరి సినిమా విషయంలో మళ్లీ రిస్క్ చేయబోతున్నాడా అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నవీన్ పోలిశెట్టి నటించిన గత చిత్రం 'అనగనగా ఒక రాజు' ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదలై దాదాపు 6 నెలలు, అంటే దాదాపు అర్థ సంవత్సరం దాటిపోయింది. అయినప్పటికీ, ఇప్పటివరకు నవీన్ నుంచి తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, నవీన్ మాత్రం ఎప్పటిలాగే 'నిదానమే ప్రధానం' అనే సూత్రాన్ని పాటిస్తూ కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఈ మేరకునే నవీన్ పోలిశెట్టి ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. 'సైరన్' చిత్ర దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ వంటి క్రేజీ స్టార్ కాస్టింగ్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో ఆంటోనీ భాగ్యరాజ్ 'సైరన్' చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా కనీస తమిళ ప్రభావం చూపించలేకపోయింది, పోనీలో అయినా వర్కవుట్ అయిందా అంటే అక్కడ కూడా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద తెలుగులో ఫ్లాప్‌గా నిలిచింది. ఒక ఫ్లాప్ దర్శకుడితో నవీన్ సినిమా చేయాలనుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి ఆంటోనీ భాగ్యరాజ్ చెప్పిన ఒక లైన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌కు బాగా నచ్చిందట. దాంతో వాళ్లే స్వయంగా చొరవ తీసుకుని ఈ కథను నవీన్ పోలిశెట్టి వరకు తీసుకెళ్లారని, కథ విన్న నవీన్ కూడా ఓకే చెప్పాడని ఇండస్ట్రీ టాక్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి ముందుకు రావడంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒక సినిమా విజయవంతం అయ్యాక హీరోలు ఎంత గ్యాప్ తీసుకోవాలనేది వారి వ్యక్తిగత ఇష్టమే అయినా, నవీన్ పోలిశెట్టి లాంటి మంచి క్రేజ్ ఉన్న హీరోలు ఇలా 6 నెలలకు పైగా ఎలాంటి సినిమా ప్రకటించకుండా ఖాళీగా ఉండటం మార్కెట్ పరంగా సరైన సంకేతం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పోలిశెట్టికి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా తిరుగులేని ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా తర్వాత కూడా నవీన్ చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. అయితే మధ్యలో అతనికి ఒక చిన్న ప్రమాదం జరగడం వల్లే ఆలస్యం జరిగింది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అలాంటి ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. టాలీవుడ్ ట్రెండ్ చూస్తే రవితేజ, శ్రీవిష్ణు ఒకరిద్దరు హీరోలను మినహాయిస్తే, రేంజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు చాలా నిదానంగా సినిమాలు తీస్తున్నారు. నవీన్ పోలిశెట్టి కూడా ఇప్పుడు అదే 'టైం టేకింగ్ జోన్' లోకి వెళ్లిపోతున్నాడు. మరి ఆంటోనీ భాగ్యరాజ్ కాంబినేషన్లో ఓకే చేసిన ఈ సినిమా ఏ సీజన్లో విడుదలవుతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
నవీన్ పోలిశెట్టి, మైత్రీ మూవీ మేకర్స్, ఆంటోని భాగ్యరాజ్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird