[ad_1]

సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఘట్టమనేని కుటుంబం నుండి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. రమేష్ బాబు తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అయిన ఘట్టమనేని జయకృష్ణ.. త్వరలోనే 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమా వచ్చినప్పటి నుంచి ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ నయా హీరో గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జయకృష్ణ కొత్తగా ఇప్పుడు కెమెరా ముందుకు రాలేదు. అతను చిన్నప్పుడే తన బాబాయ్ మహేష్ బాబు సినిమాలో మెరిశాడు.
తేజ కాంబినేషన్లో వచ్చిన డైరెక్టర్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సెన్సేషనల్ మూవీ 'నిజం'. ఆ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించిన ఆ క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. ఘట్టమనేని జయకృష్ణే. ఈ సందర్భంగా తేజ ఎంతో ఘనంగా ప్రకటించారు.
[embed]https://www.youtube.com/watch?v=KzjFPTBpr3M[/embed]
'నిజం' రిలీజ్ కి ముందు, జయకృష్ణ ఫోటోను చూపిస్తూ.. ఈ సినిమాతో మరో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని తేజ చెప్పారు. దాంతో చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోని చూపించి, హీరో అంటారేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత "ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. కృష్ణ గారి మనవడు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఫ్యూచర్లో హీరో అవుతాడనిపించింది. అందుకే మరో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను." అంటూ డైరెక్టర్ తేజ అసలు మేటర్ రివీల్ చేశారు.
తేజ ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కానీ.. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు నిజంగానే ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బాబాయ్ బాటలో పయనిస్తూ, జయకృష్ణ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.
ఘట్టమనేని జయ కృష్ణ, శ్రీనివాస మంగాపురం, మహేష్ బాబు, నిజాం మూవీ, తెలుగువన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird