[ad_1]
భారతదేశం
ఓయి-లింగారెడ్డి గజ్జల
మన మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, ప్రమోషనల్ కాల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల కాలర్ ఐ యాప్స్ వాడుతున్న యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై కొన్ని ప్రత్యేకమైన నంబర్ల సిరీస్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేయడం లేదా, వాటిని ఫిల్టర్ చేయడం లేదా ఏ థర్డ్ యాప్ వల్ల సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ కింద సరికొత్త నిబంధనలను శనివారం విడుదల చేసింది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ వంటి నియంత్రిత సంస్థలు (RBI, Sebi, IRDAI, PFRDA వాటి కింద రిజిస్టర్ అయినవి) తమ కస్టమర్లకు అవసరమైన సేవా సమాచారం, లావాదేవీల కాల్స్ కోసం.. అలాగే ప్రభుత్వ సంస్థలు నేరుగా పౌరులతో మాట్లాడేందుకు (Govt-to-Citizen) కేంద్రం ప్రత్యేకంగా '1600' సిరీస్ నంబర్లను అందజేస్తుంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం కోసం కేటాయించిన ఈ 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికి లేదా ట్యాగ్ చేయడానికి లేదా ఎలాంటి అనుమతి లేదని ట్రాయ్ స్పష్టంగా ప్రకటించారు.

టెలిమార్కెటర్లు చేసే ప్రమోషనల్ (ప్రకటనల) కాల్స్ కోసం ప్రభుత్వం '140' సిరీస్ నంబర్లను కేటాయించింది. ఈ 140 సిరీస్ నుంచి వచ్చే కాల్స్ మీకు రాకూడదనుకుంటే, కస్టమర్లు తమ మొబైల్ ద్వారా 'డు నాట్ డిస్టర్బ్' (DND) రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా మాత్రమే వాటిని అడ్డుకోవచ్చని ట్రాయ్ విడుదల చేస్తుంది. అయితే, ఈ నంబర్లను కూడా కాలర్ ఐడీ యాప్‌లు తమ సొంతంగా ఫిల్టర్ చేయడం లేదా, కస్టమర్లు వాటిని 'స్పామ్' లేదా 'ఫ్రాడ్' అని ట్యాగ్ చేయడం లేదా కుదరదని నిబంధనలు తీసుకొచ్చారు. ఒకవేళ అలా ట్యాగ్ చేస్తే.. DND లో ఆయా రంగాల నుంచి కాల్స్ కావాలని కోరుకున్న ఇతర కస్టమర్లు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ట్రాయ్ అభిప్రాయపడింది.
ట్రాయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనలపై ప్రముఖ కాలర్ ఐడీ యాప్ 'ట్రూకాలర్' (ట్రూకాలర్) సీఈఓ రిషిత్ ఝుంఝున్వాలా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ 140, 1600 సిరీస్ నంబర్ల నుంచి వస్తున్న స్పామ్ కాల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఈ రెండు సిరీస్‌ల నుంచి వచ్చే దాదాపు 5.1 కోట్లకు పైగా కాల్స్ కస్టమర్లకు సమాధానం ఇవ్వడం లేదని (అన్ ఆన్సర్డ్) చెప్పారు. ప్రస్తుతం ట్రూకాల యూజర్లు రోజూ 140 సిరీస్‌ల నుంచి 4 లక్షల కాల్స్, 1600 సిరీస్‌ల నుంచి 1.25 లక్షల కాల్స్‌ను యాక్టీవ్‌గా బ్లాక్ చేస్తున్నారు.. ఇప్పుడు కొత్త రూల్స్ కస్టమర్లపై ఈ స్పామ్ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird