బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ బి. పాపా కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు.