

మహానాడు కోసం భారీ ఏర్పాట్లు – నారా లోకేష్ నాయకత్వానికి మద్దతుగా పోస్టర్ ఆవిష్కరణ
కడప జిల్లా: రానున్న మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్ప గారి శ్రీనివాసుల రెడ్డి గారు ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి నాగముని రెడ్డి గారు, పెంచలయ్య, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి గారు మాట్లాడుతూ – కూటమి ప్రభుత్వ ఘన విజయానంతరం జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇది. అందుకే పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నాగముని రెడ్డి గారు మరియు పీవీ ప్రదీప్ కుమార్ గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని తెలియజేసారు