
వైఎస్ఆర్ జిల్లా ను వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం శుభపరిణామం /హర్షనీయం
నంద్యాలVRM న్యూస్ మే 27
పోతు గుంట రమేష్ నాయుడు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైఎస్సార్ జిల్లా ను వైయస్సార్ కడప జిల్లాగా మార్చడం చాలా మంచి పరిణామం అని ఎందుకంటే
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలిగడప కడపకు ఉన్న చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం YS Jagan Mohan Reddy పేర్ల పిచ్చితో జిల్లా పేరును ‘వైఎస్సార్’ జిల్లాగా మార్చి చేసిన తప్పును సరిదిద్దాల్సిందిగా బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ Satya Kumar Y గారు చేసిన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నం. 170తో వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్పు చేసిందని అన్నారు దీనికి కూటమి ప్రవృత్తానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు