Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి

టక్కోలు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి

by VRM Media
0 comments
Vrm media ప్రతినిధి

టక్కోలు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి

టక్కోలు గ్రామంలో ఈరోజు నిర్వహించిన సామాజిక మరియు వికలాంగుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది” అన్నారు.

“నెల మొదటి తేదీ సెలవు రోజుగా వస్తే, దానికి ముందు రోజు (30 లేదా 31వ తేదీ) నందు పెన్షన్‌లు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటివద్దకే అందజేయనున్నామని” ఆయన తెలిపారు. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం నిర్దిష్ట రోజునే, ఇంటి వద్దకే అందించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో, నాయకులు చిన్నప రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివయ్య పాల్గొన్నారు

2,819 Views

You may also like

Leave a Comment