



Vrm media ఖమ్మం
ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా అధికారులు పనిచేయాలి…. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ
*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జాతీయ పతాకావిష్కరణ చేసిన అదనపు కలెక్టర్
ఖమ్మం, జూన్ -2:
ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ, ప్రజలతో పాటు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి దశాబ్దాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీతో పాటు అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, ఇందుకై అధికారులు చిత్తశుద్ధి తో పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Vrm media ఖమ్మం