

మలేరియా నివారణ వారోత్సవాల ర్యాలీ
ప్రజలకు అవగాహన
సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూన్ 3
, మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్లో జూలై 1 నుండి జూలై 3 ప్రారంభమైన మలేరియా వారోత్సవాల్లో భాగంగా దోమల నియంత్రణ కొరకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించారు
మండలంలోని మాధవరం1 , గ్రామం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి ఉప్పరపల్లి, మాధవరం, 1,2,3, వార్డు గ్రామాలలో మలేరియా వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శివ కుమార్ మంగళవారం మాట్లాడుతూ జూన్, 1 నుండి, 30 తేదీ వరకు జరిగే మలేరియా వారోత్సవాల్లో ర్యాలీ నిర్వహించి దోమలు కుట్టడం, వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా టైఫాయిడ్, బోదకాలు వంటి జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని దోమల నియంత్రణ కొరకై మీ గృహాల పరిసర ప్రాంతాలలో దోమల నియంత్రణ కొరకై నీరు నిలువ లేకుండా ఉంచాలని నీరు నిల్వ ఉన్నచో లార్వా ఉత్పత్తి చెంది దోమల వ్యాప్తి చందే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా వైద్యాధికారి డాక్టర్ శ్రీవిద్య, ఎం పి హెచ్ ఓ, నాగవల్లి, సూపర్వైజర్లు, రమణయ్య, జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు