by VRM Media
0 comments

టక్కోలు బీసీ కాలనీ నుండి స్మశాన వాటికకు వెళ్లే రహదారి అభివృద్ధికి కి అడ్డుగా ఉన్నా దీర్ఘ కాలిక సమస్య పరిష్కారం

సిద్ధవటంVRM న్యూస్ జూన్ 7

సిద్ధవటం మండలం టక్కోలు గ్రామం, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు
టక్కోలు బీసీ కాలనీ నుండి స్మశాన వాటికకు వెళ్లే రహదారి పై దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం దొరికింది. పలు సంవత్సరాలుగా రహదారి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను (కరెంట్ పోల్స్) పార్లమెంట్ కార్యదర్శి శ్రీ అండ్లూరి నాగముని రెడ్డి ఆధ్వర్యంలో తొలగించి పక్కకు షిఫ్ట్ చేయడం జరిగింది.
ఈ పనిని కాంట్రాక్టర్ రమణ చేపట్టగా, విద్యుత్ స్తంభాలను పక్కకు షిఫ్ట్ చేసి రహదారి నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా బీసీ కాలనీ నివాసితులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం లో బాగా జరుగుతోంది అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థులు, పెద్దలు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అలసట లేకుండా పని చేస్తున్న నాగముని రెడ్డి గారి సేవలను ప్రజలు కొనియాడారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, త్వరలోనే రహదారి పనులు కూడా మొదలు పెడతాము అని నాగముని రెడ్డి తెలిపారు.

2,888 Views

You may also like

Leave a Comment