Vrm media alluri జిల్లా ప్రస్థినిది

జై భీమ్ యూనియన్ జర్నలిస్టులు సంఘంగా నామకరణం
హుకుంపేట ( అల్లూరి జిల్లా ) న్యూస్ :-
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక శివాలయం ఆవరణలో పత్రిక సోదరులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హుకుంపేట మండలం నూతన జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు చేసి అధ్యక్షులుగా ఏ. భాస్కర్ ఉపాధ్యక్షులుగా జన్ని. వెంకట్ సెక్రటరీ గా శోభన్ క్యాషియర్ గా ధనసాని. శివ,పిఆర్ఓ గా బంగురు. విజయ్ ను ఎన్నుకొని నూతన యూనియన్ సంఘంకు జై భీమ్ జర్నలిస్టుల సంఘంగా నామకరణం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మన యూనియన్ లో వున్నా సోదరులు అందరూ ప్రజలతో మమేకమై ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చి ఆ సమస్యలు పరిష్కారం కై ఎల్లవేళలా శ్రమించాలని అలాగే యూనియన్ లో అందరూ కలిసి మెలిసి ఉండాలని ముఖ్యంగా కొన్ని వార్తలు రాసినప్పుడు అనేక బెదిరింపులు పలు సమస్యలు ఎదురైవుతాయి మనం నిజం నిర్భయంగా రాసినప్పుడు ఎవడికి భయపడే సమస్యే లేదు వాడు ఒక జర్నలిస్టును భయపెట్టాడు అంటే వాడు భయపడినట్లే అనేది ప్రతి జర్నలిస్టు గుర్తుంచుకోవాలని. యూనియన్ లో ఉన్న జర్నలిస్టుకు ఏ కష్టం వచ్చిన ఏ సమస్య వాటిల్లిన మనమందరం కలిసికట్టుగా ఉండి ఆ సమస్య పై పోరాటం చేసి ఆ కష్టం తీర్చాలని కోరారు. నేడు నూతనంగా యూనియన్ ఏర్పాటు చేసిన జై భీమ్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం సోదరులకు పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, హుకుంపేట మండల పీసా కమిటీ సంఘం వారు శుభాకాంక్షలు తెలిపారు.