

రాజంపేటVRM న్యూస్ జూన్ 21
సంకల్పం.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేట లోని బిబిఎన్ పల్లి గ్రామంలో నేడు అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక గ్రామస్తులు తో కలిసి యోగాలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ “ఒకే భూమి… ఒకటే ఆరోగ్యం కోసం యోగ” అనే సంకల్పంతో ప్రతి ఏడాది యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం, యోగ దినోత్సవంలోని అసలైన అంతరార్థాన్ని ఆవిష్కరించుకోవడమే.
మనమంతా ఇదే సంకల్పాన్ని తీసుకుని వసుధైవ కుటుంబ భావనతో ముందుకు సాగాలి. అంతర్జాతీయ యోగ దినోత్సవం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యోగ మార్గాన్ని సాధన చేస్తూ ముందుకు సాగుతున్నారు.