హైదరాబాదులోని మహా టీవీ కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి అమానుషమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లిలో సోమవారం ఆయన మాట్లాడారు.మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే పోరాటం చేయాలన్నారు. ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.