Home ఆంధ్రప్రదేశ్ సిద్దవటం మండలం అభివృద్ధి కోసం మంత్రి సబితమ్మతో చర్చలు

సిద్దవటం మండలం అభివృద్ధి కోసం మంత్రి సబితమ్మతో చర్చలు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ జూలై 1.
కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి గారైన సబితమ్మ గారిని పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సిద్దవటం మండలంలోని వివిధ సమస్యలు, అభివృద్ధి అవసరాలపై మంత్రితో విస్తృతంగా చర్చించారు.
సబితమ్మ మాట్లాడుతూ, సిద్దవటం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తాము అంకితభావంతో పనిచేస్తామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ నేతృత్వంలో మండల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు
అదేవిధంగా, టీడీపీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలసికట్టుగా పని చేయాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మండల అభివృద్ధి మరియు పార్టీ అభివృద్ధి కోసం ఈ సమావేశం నిర్వహించామని, మండల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఇట్లు
పార్లమెంట్ కార్యదర్శి
నాగముని రెడ్డి

2,853 Views

You may also like

Leave a Comment