

సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూలై 10
టక్కోలు: విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ఆదేశాలమేరకు, టక్కోలు గ్రామంలోని అరుంధతి వాడ ఎలిమెంటరీ స్కూల్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరియు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి హాజరు అయ్యారు. చైర్మన్ వి.పాలకొండయ్య, వైస్ చైర్మన్ స్వాతి, శైలజ, యశోద, రాజేశ్వరి, శుభాషిణి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీచర్ జె. విరమ్మ నడిపారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ –
“పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేసినప్పుడే విద్యారంగం లో అభివృద్ధి సాధ్యమవుతుంది. మన పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే ప్రాథమిక స్థాయిలోనే బలమైన విద్యా పునాది అవసరం. అటువంటి కార్యంలో ఈ స్కూల్ మంచి ప్రామాణికతతో ముందుకు వెళ్తుండడం అభినందనీయం.” అని అన్నారు.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన సూచనలను గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.