
నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో వెలసిన శ్రీశ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేసామని నందలూరు ఎస్సై తెలిపారు పొత్తపి,చెన్నయ్యగారి పల్లి లేబాక గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్ కు వచ్చే ప్రజలు నందలూరు గుడి వైపు దారిలో రాకుండా ఈదరపల్లి,దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్ లోకి వెళ్ళల ని, శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణానికి అలానే దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన వెళ్ళవలెను, అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథ స్వామి దర్శనానికి కళ్యాణానికి వచ్చు భక్తులు నందలూరు షాది ఖానా వద్ద ఉన్న పార్కింగ్ లో వాహనాలు నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు కాలినడకన రావలసిందిగా ఎస్ ఐ తెలిపారు శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది, కావున నందలూరు మండల ప్రజలు, నాయకులు అలానే మీడియా మిత్రులు పోలీస్ వారికి సహకరించలని నందలూరు ఎస్ఐ,వి. మల్లికార్జున రెడ్డి.