Home ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులతో సమావేశమైన జిల్లా అదనపు ఎస్పీ. ( పరిపాలన)ఎం వెంకటాద్రి

జిల్లాలోని కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులతో సమావేశమైన జిల్లా అదనపు ఎస్పీ. ( పరిపాలన)ఎం వెంకటాద్రి

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా

VRM న్యూస్ రాజంపేట ఇంచార్జ్ రవిబాబు జూలై 12

న్యాయ వ్యవస్థలో మీరు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనది.
కోర్టులో మీరు ప్రదర్చించే నిబద్ధత, నిజాయితీ, మరియూ వృత్తి నైపుణ్యం చాలా ముఖ్యమైనవి.
జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) యం.వెంకటాద్రి
రాయచోటి, జులై 12: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో, రాష్ట్ర డిజిపి శ్రీ. హరిష్ కుమార్ గుప్తా ఐపిఎస్ మరియూ జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, శనివారం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం. వెంకటాద్రి కోర్టు కానిస్టేబుళ్ళు, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు, జిల్లా లీగల్ లైజన్ యూనిట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా పోలీసులకు సంబంధించి, అన్ని చట్టపరమైన చర్యలపై నిరంతర కృషి, సమన్వయం, మరియు పర్యవేక్షణ కోసం చట్టపరమైన అనుసంధాన విభాగం రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు సృష్టించబడింది. (DLLU) ఇందులో విచారణ లోని కేసులు (పిటి కేసులు) బెయిల్ దరఖాస్తులు, అప్పిళ్లు, కోర్టు ప్రక్రియలు, మరియు ప్రాసిక్యూషన్ కు సంబంధాలు ఉన్నాయి. ఈ విభాగం జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో చట్టపరమైన కేంద్రంగా పనిచేస్తుంది.
ఈ సందర్భంగా జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులతో అదనపు ఎస్పీ, (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి మాట్లాడుతూఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో జరిగే అన్ని కోర్టుల లోని కేసులు, వాటి వివరాలు సాయంత్రం లోపల జిల్లా పోలీసు కార్యాలయానికి చేరాలని, రోజులో సమన్లు, వారెంట్లు, ఎన్ని తీసుకున్నారని, వాటి పురోగతిపై వివరాలు అడిగారు, జడ్జిమెంట్ కాపీ వచ్చినప్పుడు వాటి అప్పీల్ కు వెళ్ళుటకు కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిని అరెస్టు చేసినప్పుడు బెయిల్ రిమాండ్ వివరాల గురించి సంబంధిత అధికారులకు జిల్లా పోలీసు కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.
న్యాయ వ్యవస్థలో మీరు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనది. కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగడానికి, కోర్టుల గౌరవాన్ని నిలబెట్టడానికి మీ కృషి ప్రశంసనీయం. మీరు ప్రతిరోజూ కోర్టులకు హాజరయ్యే ప్రజలతో, న్యాయవాదులతో, న్యాయమూర్తులతో నేరుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో, మీరు ప్రదర్శించే నిబద్ధత, నిజాయితీ, మరియు వృత్తి నైపుణ్యం చాలా ముఖ్యమైనవి. కేసుల విచారణకు అవసరమైన పత్రాలను సమర్పించడం నుండి, సాక్షులను కోర్టుకు హాజరుపరచడం వరకు, మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితత్వం మరియు సమయపాలన పాటించాలి. ప్రజలతో మర్యాదగా, సహనంతో వ్యవహరించండి. కోర్టుకు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయ ప్రక్రియపై అవగాహన తక్కువగా ఉండవచ్చు. వారికి మీరు అందించే సహకారం, మీ స్నేహపూర్వక వైఖరి న్యాయ వ్యవస్థపై వారి నమ్మకాన్ని పెంచుతుంది. కోర్టు విధుల్లో సమయపాలన మరియు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని అన్నారు. కేసుల విచారణకు ఇది చాలా అవసరమని తెలిపారు. కోర్టు ప్రాంగణంలో, కోర్టు వెలుపల కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కోర్టు అధికారులతో, న్యాయవాదులతో సమర్థవంతమైన సమన్వయం చేసుకోవడం ద్వారా కేసుల పురోగతికి సహాయపడాలని కోరారు. కోర్టుకు వచ్చే సాక్షులకు భద్రత కల్పించడం, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం తమ విధి అని గుర్తు చేశారు. సాక్షులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాంగ్మూలం ఇచ్చే వాతావరణం కల్పించాలని సూచించారు. కేసులకు సంబంధించిన రికార్డులను పటిష్టంగా నిర్వహించడం చాలా కీలకమని, దీనివల్ల విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. కోర్టు కానిస్టేబుళ్లు తమ వృత్తిని గౌరవంగా భావించాలని, న్యాయవ్యవస్థకు తమ సేవలు ఎంతో విలువైనవి అని గుర్తుంచుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ మరియు సమర్థత మీ పనిలో ప్రధాన భాగాలు కావాలి. ఏదైనా సమాచారం అవసరమైనప్పుడు తక్షణమే పై అధికారులకు తెలియజేయండి. మీ విధులలో ఏవైనా సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఎస్పీ గారికి, లేదా నా దృష్టికి తీసుకురండి. మీరు జిల్లా పోలీసు వ్యవస్థలో ఒక అంతర్భాగం. మీ పనితీరు జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంలో పరోక్షంగా దోహదపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల, శ్రేయస్సు పట్ల కూడా శ్రద్ధ వహించండి. మీ అందరి సహకారంతో, జిల్లాలో న్యాయ పాలనను మరింత బలోపేతం చేయగలమని ఆశిస్తున్నానని, ఈ సమావేశం కోర్టు విధుల్లో పారదర్శకతను, సమర్థతను పెంచడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఆర్బి ఇన్స్పెక్టర్ యం. తులసీరాం, డిస్టిక్ లీగల్ లైజన్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఏ, ఆదినారాయణ రెడ్డి, ఎస్ఐ రవికుమార్, జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులు పాల్గొన్నారు.

2,846 Views

You may also like

Leave a Comment