Home ఆంధ్రప్రదేశ్ నగరం నడిబొడ్డున ప్రభుత్వ భూములు భూకబ్జాలు – అక్రమ నిర్మాణాలు

నగరం నడిబొడ్డున ప్రభుత్వ భూములు భూకబ్జాలు – అక్రమ నిర్మాణాలు

by VRM Media
0 comments

ఒకవైపు కలెక్టర్ ప్రభుత్వ భూములు కాపాడమని ఆదేశాలు – మరోవైపు పట్టించుకోని సంబంధిత అధికారులు

పాడేరు (అల్లూరి జిల్లా ) న్యూస్ :-

అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒకవైపు భూకబ్జాలు మరోవైపు అక్రమ నిర్మాణాలు పాపం పెరుగుతున్నట్టు పెరిగిపోతున్నాయి. ఒకవైపు జిల్లా అధికారులు ప్రభుత్వ భూములు కాపాడమని ఆదేశాలు జారీ చేస్తే భూ కబ్జాదారుల అదే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి శాశ్వత భవనాలు నిర్మాణాలు చేపట్టి అధికారులకే సవాల్ విసిరేలా మారారు . నిజమా కాదా అనేది తెలియాలంటే పాడేరు ప్రధాన కేంద్రం కాలేజీ గ్రౌండ్ పక్కన ప్రభుత్వ స్థలాల్లో చిన్న చిన్న బడ్డీలు పెట్టుకొని కొంతమంది వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేవారు. కానీ నేడు అదే స్థలాల్లో శాశ్వత భవనాలు నిర్మాణాలు చేపడుతున్నారు. మరి ఇది సంబంధిత అధికారులు నిర్లక్ష్మమా లేక ముడుపులా అనే విషయానికి సమాధానం చెప్పాలని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఈ భూకబ్జాలు అక్రమ నిర్మాణాలు సంబంధిత అధికారులు కనుసన్నల్లోనే జరుగుతుందని,దీనికి నిదర్శనం ప్రతి అధికారి ఇదే మార్గంలో నడుస్తున్న దర్జాగా ప్రభుత్వ స్థలాల్లో శాశ్వత భవనాలు కడుతున్నారంటే అధికారుల హస్తం కాక ఇంకేమిటి అని ప్రశ్నిస్తున్నారు. 1/70 చట్టం కాపాడాలని అదేవిధంగా ప్రభుత్వ భూములు కాపాడాలని జిల్లా అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే నగరం నడిబొడ్డున ఏకంగా ప్రభుత్వ స్థలాలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారి యంత్రాంగం మౌనం పాటించడం నిజంగా ఇది దౌర్భాగ్యం అని పలువురు అంటున్నారు. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాలు నిలిపి వాటిని తొలగించి భూ కబ్జా దారులపై కేసులు నమోదు చేసి చర్యలు.తీసుకునేలా చర్యలు చేపడతారా లేక జిల్లా అధికారుల ఆదేశాలు భేఖాతార్ అనేలా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాల్సిందే..?

2,817 Views

You may also like

Leave a Comment