Home వార్తలుఖమ్మం చెట్లను నాటితేనే భవిష్యత్ తరాలకు మనుగడమేయర్ పునకొల్లు నీరజమధురానగర్ లో ఘనంగా వనమహోత్సవం

చెట్లను నాటితేనే భవిష్యత్ తరాలకు మనుగడమేయర్ పునకొల్లు నీరజమధురానగర్ లో ఘనంగా వనమహోత్సవం

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

ఖమ్మం టౌన్ :
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ మధురానగర్ కాలనీ రోడ్ నెంబర్ 16లో శనివారం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఖమ్మం. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునకొల్లు నీరజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి ఉత్సహంగా మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్క పెరిగి పెద్దదయ్యే వరకూ పిల్లల పెంపకం మాదిరిగా బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు. మొక్కల పెంపకం ఒక ఉద్యమం లా ముందుకు తీసుకెళితే తప్ప భవిష్యత్ తరాలకు మనుగడ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కూరాకుల వలరాజు, కమర్తపు మురళి, ఖమ్మం కార్పొరేషన్ ఫారెస్ట్ అధికారి బెల్లం రాధిక, సీనియర్ జర్నలిస్ట్ షాడో న్యూస్ మీడియా అధినేత నాగేందర్ అడపాల, కాంగ్రెస్ ఓబిసి సెల్ జిల్లా కార్యదర్శి బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ , మధురానగర్ కాలనీ వాసులు అజీజ్, జమలయ్య, కృష్ణయ్య , ఖాదర్, కోటేశ్వవరి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు,

2,855 Views

You may also like

Leave a Comment