ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 14న సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ,మండల,డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. సమస్యలు పరిష్కారం కానివారు రావాలని తెలిపారు.