
VRM న్యూస్ అన్నమయ్య ఇంచార్జ్ రవిబాబు జులై 19 అమెరికన్ విస్ డమ్ పీస్ విశ్వవిద్యాలయం 27 జూలై 2025 న వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి గౌరవ డాక్టరేట్ మరియు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేసే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి శంకర్ ను ఆహ్వానించింది•పాండిచ్చేరి లోని హోటల్ అతిధి లో జరిగే ఈ కార్యక్రమము లో అమెరికన్ విస్ డమ్ పీస్ విశ్వవిద్యాలయానికి చెందిన పుస్తక ఆవిష్కరణ మరియు విభిన్న రంగాలలో ప్రతిభ కల వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ పురస్కారాల ప్రధానము ఉంటుంది•ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి శాసనసభ స్పీకర్ ఎమ్ ఎల్ ఏ ఎంబలం సెల్వం, 5 సార్లు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన డాక్టర్ కరాటే శ్రీనాథ్, కోయంబత్తూర్ కు చెందిన ఆల్ ఇండియా ఏంటి విండోడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కతిర్వెల్, పాండిచ్చేరి కేంద్ర కారాగార పోలీస్ సూపరిండెంట్ భాస్కరన్, పాండిచ్చేరి నమ్మాళ్వార్ న్యాచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ కో ప్రెసిడెంట్ రాజా వేణుగోపాల్, పాండిచ్చేరి ఠాగూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన రేఖా రాజా, దేవి ప్రియ,నారాయణస్వామి,విమల,విఘ్నేశ్వరన్,షణ్ముగప్రియ తదితరులు పాల్గొంటారని ఆహ్వాన పత్రంలో విశ్వవిద్యాలయం పేర్కొంది.