Home ఆంధ్రప్రదేశ్ సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటికి తెలుగుదేశం’

సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటికి తెలుగుదేశం’

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూలై 22

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరియు రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ కనుములో పల్లె, జేఎంజె, గ్రామంలో మంగళవారం రోజున సుపరిపాలనలో తొలిఅడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను, ప్రజల సంక్షేమం–అభివృద్ధి కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం, భవిష్యత్తులో చేపట్ట బోయే విదివిధా నాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇంటిలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ‘తల్లికి వందనం’ వచ్చిందని ప్రజలు తెలిపారు. సంవత్సరానికి, ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఆగస్టు నెలలో నుండి ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణము, రైతులకు అన్నదాత సుఖీభవా వంటి పథకాలను అమలు కాబోతున్నాయి అని ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, మండల క్లస్టర్ ఇంచార్జ్, దారపునేని దశరథ రామానాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి, కాడే శ్రీనివాసులు నాయుడు, మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్, జవహర్ భాష, నియోజవర్గ మైనార్టీ నాయకులు డాక్టర్ వీరభద్రుడు, గ్రామ సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు, స్థానిక టిడిపి లీడర్, సాదక్ భాష, మండల బీసీ నాయకులు గాలి సుబ్బయ్య యాదవ్, కృష్ణ యాదవ్, రెడ్డయ్య నాయుడు, హరిప్రసాద్, మురళి రాయల్ తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,848 Views

You may also like

Leave a Comment