

మృకుండ మల్లేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన రాటాల రామయ్య
సిద్దవటం VRM న్యూసజూలై 23
నేడు విడుదల కాబోతున్న “హరి హర వీరమల్లు” చిత్రం ఒక పోరాట యోధుడి చరిత్రను ఈ రాష్ట్రంలో దేశంలోని ప్రజలందరికి చరిత్రను తెలీజేయ్యటంతో పాటు రికార్డులు సృష్టించడం ఖాయమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన హరిహర వీరమల్లు నేడు విడుదల కానున్న నేపథ్యంలో సినిమా విజయవంతం కావాలని కోరుతూ బుధవారం ఒంటిమిట్ట మండలంలోని కొత్తమాధవరం సమీపంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయుడికి,మృకుండ మల్లేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా రామయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా,పేదల కోసం నిరంతరం పోరాడే ప్రజా నాయకుడిగా ఎదిగారన్నారు.ఈ చిత్రం ఒక యోధుని జీవిత కథ మాత్రమే కాకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని తెలిపారు.ఈ మేరకు చిత్రాన్ని అభిమానులంతా విజయవంతం చేయాలని రామయ్య కోరారు. అనంతరం హరహర వీరమల్లు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.