

రైతులకి భరోసానిచ్చిన అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం SI మల్లికార్జున్ రెడ్డి
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు జులై 24
నందలూరు మండలం, టంగుటూరు గ్రామానికి చెందిన రైతు చలమాల కేశవులు ఫిర్యాదుపై స్పందించిన ఎస్సై మల్లికార్జున్ రెడ్డి సార్ మరియు పోలీస్ బృందం, ఈరోజు టంగుటూరు గ్రామానికి వచ్చి కేశవులు వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. పొలం వద్ద విద్యుత్ వైరు ఉంచిన ఘటనపై విచారణ చేశారు.
మల్లికార్జున్ రెడ్డి స్పందన రైతుల్లో నమ్మకాన్ని పెంచింది.
ఇలాంటివి మరలా జరగకుండా, దురుద్దేశపూర్వకంగా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని రైతులకు ధైర్యం చెప్పారు
రైతులు భద్రంగా వ్యవసాయం చేయగలగడం కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.