

తీర్చేదెవరు..?
అనంతగిరి (అల్లూరి జిల్లా) న్యూస్:VRM Midea
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తంగేలబంద గ్రామంలో గల గిరిజన విద్యార్థులకు విద్య అనేది ఒకవైపు అందని ద్రాక్షలా మరోవైపు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమివ్వ లేనట్టు వుంది. ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో స్కూల్ లేక రోజురోజుకు మా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు స్కూల్ మంజూరు చేయమని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే మా విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా గ్రామానికి స్కూల్ మంజూరు చేశారు. అయితే మా గ్రామంలో గల స్కూలుకి ఒక ఉపాధ్యాయుని నియమించారు. అయితే ఆ మాస్టారు అప్పుడప్పుడు విధులకు వస్తూ ఆయన రాని సమయంలో ప్రత్యామ్నాయంగా ఇదే గ్రామంలో పదవ తరగతి చదువుతున్న కుర్రవాడికి 4000 జీతం ఇచ్చి ఆ కుర్రవాడితో మా పిల్లలకు విద్యాబోధన చేస్తుండడంతో మా పిల్లలు విద్యకు దూరమవుతున్నారనే బాధతో మా గ్రామంలో గల పాఠశాలకు నియమించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు రావడం లేదని ఈ మధ్యకాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా నేడు మండల అధికారులు మా గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామానికి ఉపాధ్యాయులు రావడం కష్టం పక్క గ్రామంలో ఉన్న స్కూలుకి మీ పిల్లలను పంపాలని ఆదేశాలు జారీ చేయగా మేము దానిని తిరస్కరించామని, ఎందుకంటే మేము గంగవరం పాఠశాలకు పిల్లలు పంపించాలంటే వాళ్లు తిరిగి వచ్చేవరకు మేమంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండాలని దీనికి కారణం పాఠశాలకు వెళ్లే మార్గమధ్యలో కొండలు,వాగులు ఉన్నాయి వారు ఏ క్షణంలోనైనా ప్రమాదం బారిన పడవచ్చని తెలిపారు. మేము ఈ సందర్భంగా అధికారులకు చెబుతున్న ముఖ్య విషయం ఏమిటంటే మా గ్రామంలో గల పాఠశాలకు గంగవరం పాఠశాలకు సంబంధించి విద్యార్థుల సంఖ్య సమానం కనుక అక్కడ నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు అక్కడ ఉపాధ్యాయుణ్ణి మా గ్రామ పాఠశాలకు నియమిస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సంబంధిత అధికారులు ఈ కోణంలో ఆలోచించాలని కోరారు. లేకుంటే మా పిల్లలతో సహా గ్రామస్తులందరూ మమేకమై సంబంధిత కార్యాలయాలు ముట్టడి చేసి మా పిల్లలతో కలిపి మా గోడు వినేలా పోరాటం చేస్తామని అటు ప్రభుత్వంను ఇటు అధికారులను హెచ్చరిస్తూ,ఒక జిల్లా కలెక్టర్ మా పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించి స్కూలు మంజూరు చేస్తే సంబంధిత అధికారులు మా పిల్లలపై కాస్త జాలీ దయ కూడా లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటే మా పిల్లల భవిష్యత్తు కన్నా ఇక్కడ పాఠాలు బోధించే ఉపాధ్యాయుల సౌకర్యాలే ముఖ్యం అనేలా వ్యవహరించడం సరికాదని ఇప్పటికైనా మా పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. . ఏది ఏమైనాప్పటికి ఒక జిల్లా కలెక్టర్ ఈ గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించి న్యాయం చేసినప్పటికీ వీళ్లకు వేరే రూపంలో అన్యాయం జరగడం బాధాకరం కాదా…?