Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా కడపఒంటిమిట్ట మండలంలోని నడింపల్లి ప్రభుత్వ భూమిలో ఉన్న డాబా ను తొలగించాలి.టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్గగ్గుటూరి. మౌలాలి

వైఎస్ఆర్ జిల్లా కడపఒంటిమిట్ట మండలంలోని నడింపల్లి ప్రభుత్వ భూమిలో ఉన్న డాబా ను తొలగించాలి.టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్గగ్గుటూరి. మౌలాలి

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట జూలై 25

డాబాను తీసివేయండి ప్రభుత్య భూమి లో నిర్మించిన డాబాను తొలగించడలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ మండల వైస్ ప్రసిడెంట్ గగ్గటూరి మౌలాలి అన్నారు కడప రాజంపేట హైవే నందు దానిని ఆనుకొనివున్న నడింపల్లి నందు ఒంటిమిట్ట పొలం సర్వే నెంబర్ 1867 లో వైస్సార్ పార్టీ నాయకుడు తులసి కిషోర్ సాయి కుమార్ అక్రమంగా డాబా నిర్మించి నాడని ఈ డాబా సైట్ ప్రభుత్య భూమి అని అందులో బహుళ ప్రయోజనాకరి నీటికుంట కలదని దీనిని సైతం కొంత పూడ్చి దానిని లారీలు నిలుపుకొనే స్టాండుగా మార్చడని R&B ని సైతం ఆక్రమించి ఇతర స్టేట్స్ వారికి బాడుగలకు ఇచ్చినాడని అన్నాడు అక్కడ అధిక సంఖ్యలో లారీలు ఆగడం తో ఆ దారిన గ్రామస్తులు ఎవరు వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుచున్నట్లు తెలిపారు ఈ విషయంపై డిసెంబర్ నెల 2024 నుండి పలుమార్లు ప్రజాసమస్యల పరిస్కార వేదికలో గ్రామస్తులు పిర్యాదు చేసారని తెలిపారు ఈ నెల 16వ తేదిన నేనే స్వయంగా ప్రజా వేదికలో RDO గారిని కలిసి ఫేక్ D పట్టా పై చర్యలు తీసుకోండి అని అడుగగా ఎవరిని అడుగుతావంటూ నాపై కోపం ప్రదర్శించాడని వాపోయాడు గత తహసీల్దారుగారు RDO గారికి ఫైల్ పంపమని వారి ఆదేశాలు రాగానే అన్ని తొలగిస్తామని అబద్దాలు వల్లించి బదిలీ పై వెళ్లారని అన్నారు.వైసీపీ హయాంలో ఫేక్ డి ఫారం తో డాబా నిర్మించారాని R&B లో వున్న రూమ్ కు మాత్రమే వ్యాపారానిమిత్తము కరంటు సర్వీస్ ఉందని గుర్తు చేసారు వెంటనే వాటిని తొలగించి గ్రామానికి మేలు అన్నాడు.
ఒంటిమిట్ట తాసిల్దార్ నడింపల్లిడాబా గురించి దామోదర్ రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ భూములు ఉన్నదా లేదా అని సర్వే చేయించి నోటీసులు ఇస్తామన్నారు.

2,817 Views

You may also like

Leave a Comment