Home ఆంధ్రప్రదేశ్ బిజెపి కృషితో కుగ్రామం అయిన ఏకిరపల్లి రహదారికి మహర్దశ.రూ 3.60 కోట్లతో ప్రతిపాదనలు.హర్షం వ్యక్తం చేస్తున్న ఏగిరిపల్లి గ్రామస్తులు.

బిజెపి కృషితో కుగ్రామం అయిన ఏకిరపల్లి రహదారికి మహర్దశ.రూ 3.60 కోట్లతో ప్రతిపాదనలు.హర్షం వ్యక్తం చేస్తున్న ఏగిరిపల్లి గ్రామస్తులు.

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ ప్రతినిధి జూలై 25

బిజెపి కృషితో బగిడిపల్లి నుండి ఎకిరిపల్లి మహర్దశ
పోతు గుంట రమేష్ నాయుడు

రాజంపేట మండలంలో అత్యంత మారుమూల కు గ్రామమైన పుల పుత్తూరు పంచాయతీ లోని ఏకిరిపల్లి గ్రామరహదారి కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు కృషి ఫలితంగా మహర్దశ వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఆ గ్రామం రహదారికి నోచుకోలేదు. నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ గ్రామ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల నే ఆలోచన చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజంపేటకు చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు పోతు గుంట రమేష్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏకిరిపల్లి గ్రామ రహదారిని నిర్మించేందుకు 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ తో కలిసి పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర ను కలిసి 3.1కిలోమీటర్ల రహదారి బకెట్పల్లి నుండి ఏకిరిపల్లి గ్రామం వరకురూ 3.6 0 కోట్లతో ప్రతిపాదనలు స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో తయారు చేయించి ప్రభుత్వానికి నివేదికను ఈ నివేదికను ప్రభుత్వం అనుమతించడంతో ఆయన ఈరోజు ఆ గ్రామాన్ని సందర్శించి మీ గ్రామానికి మూడు కోట్లతో 60 లక్షలు రహదారి మంజూర అయిందని త్వరలో మీ కలలు నెరవేరుతున్నాయని దీంతో ఆ గ్రామస్తులు పోతు గుంట రమేష్ నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి హర్షం వెలిబుచ్చారు. అనంతరం పోతు గుంట రమేష్ నాయుడు గ్రామంలో విస్తృతంగా పర్యటించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. కొంతమంది కి పింఛన్లు రాలేదని పాఠశాలకు సక్రమంగా ఉపాధ్యాయులు రావడంలేదని గ్రామానికి రహదారిలేదని చాలామందికి ఇల్లు లేవని, ఉపాధి హామీ పనులు చేస్తే కూలి డబ్బులు చెల్లించలేదని రెండు నెలల నుంచి పనులు ఇవ్వలేదని ఆయనకు మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందించిన పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఈ విషయాలన్నింటినీ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలన్నింటిని త్వరలోనే పరిష్కరించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టు పోగుల ఆదినారాయణ, బిజెపి రాజంపేట మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి పెనుగొండ రమణ, మండల ఉపాధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు.

2,814 Views

You may also like

Leave a Comment