

కడప జిల్లాVRM స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ జులై 25:
కడప జిల్లా ఫుట్‌బాల్ అసోసి యేషన్ వారు శుక్రవారం తేదీన డాక్టర్ వైయస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ నందు పెన్నా జోనల్ స్థాయి జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలను నిర్వహిం చిందని తెలియజేశారు.ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైయస్ ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డిఎస్‌డిఓ జగన్నాథ రెడ్డి ,సత్య సాయి వర్సెస్ కడప జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ పోటీలలో కడప, సత్య సాయి అన్నమయ్య జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ పోటీలను ఏపి ఎఫ్ ఏ జనరల్ సెక్రటరీ ఎం డేనియల్ ప్రదీప్ కడప ఫుట్‌బాల్ అసోసి యేషన్ జనరల్ సెక్రటరీ మామిడి సుధీర్ , డాక్టర్ వైయస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫుట్‌బాల్ కోచ్ హరి , స్పోర్ట్స్ స్కూల్ కోచ్‌లు, ఫిజియో ఇతర సిబ్బంది ఈ పోటీలను ఎంతో విజయవంతంగా నిర్వహించారు.
ధన్యవాదాలు తెలిపారు