

కల్లూరు VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
జూలై 25 : స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఉబ్బన నాగేశ్వరావు రెవిన్యూ (జూనియర్) అసిస్టెంట్
సతీమణి శిరీష కుమార్తె చిరంజీవి విద్యా కుమారుడు చిరంజీవి హర్ష స్ఫూర్తి ఫౌండేషన్ వారు పేద విద్యార్థుల కొరకు తలపెట్టిన ఒక పలక ఒక బలపం ఒక పుస్తకం కార్యక్రమానికి స్పందించి తమ వంతు సహాయంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనె విద్యార్థులకు అందించమని 130 నోట్ బుక్స్ 130 పెన్నులు 130 పెన్సిల్స్ (సుమారు రూ 3500 విలువ చేసే) సామాగ్రి నీశుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు కి అందించడం జరిగింది ఒక పేద విద్యార్థిగా పలక,బలపం, పుస్తకం కొనలేక ఆనాడు మేము పడిన ఇబ్బంది, ప్రస్తుత అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో అ పలక,బలపం, పుస్తకానికి ఎవరు ఇబ్బంది పడకూడదని మానవతా దృక్పధంతో స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఒక మంచి కార్యక్రమానికి సహాయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇంతటి గొప్ప సహాయాన్ని అందించిన నాగేశ్వరరావు శిరీష దంపతులకు ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్ ప్రతినిధి వరకా రామారావు
వాలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు.