

వైయస్సార్ జిల్లా కడప
VRM న్యూస్ ఒంటిమిట్ట జూలై 26
ఒంటిమిట్ట పంచాయతీలో పందుల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒంటిమిట్టలో పందులను విచ్చలవిడిగా గ్రామంలో వదిలిపెట్టి తమకు అవసరమైనప్పుడు పందుల యజమానులు వలవేసి పట్టుకుని దూరప్రాంతలకు అమ్ముకునేవారు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి పందుల యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది పందుల వలన ప్రజల్లో అనేక రకాల జబ్బులు వస్తున్నాయని మరియు మెదటివాపు జబ్బు అంటుకునే ఎక్కువగా ఉన్నాయని పందుల యజమానులచే పందులు పట్టించి తీసుకెళ్లాలని తెలిపారు. గతంలో నోటీసులు ఇచ్చిన పందుల యజమానులు కాతరు చేయలేదని ఇప్పుడు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పందుల యజమానులకు కఠిన చర్యలు తప్పవని ఆదేశించడంతో వెంటనే స్పందించి పందుల యజమానులు వారే స్వయంగా వచ్చి పందులను పట్టుకుని తీసుకెళ్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట వీఆర్వో. అంజయ్య పంచాయతీ కార్యదర్శి సుధాకర్. పంచాయతీ సిబ్బందిపాల్గొన్నారు.