

సిద్ధవటం VRM లక్ష్మీనారాయణ జూలై 26
సిద్ధవటం, భాకరాపేట రహదారి నందు ఉన్న పరమాత్మ ఆశ్రమంలో వృద్ధులకు రాజంపేట ఆంధ్రజ్యోతి పీసీ ఇంచార్జ్ రామచంద్రయ్య, కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు మండలంలోని సిద్ధవటం, భాకరాపేట రహదారి నందు ఉన్న పరమాత్మ వృద్ధ ఆశ్రమంలో అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి వృద్ధులకు రాజంపేట, ఆంధ్రజ్యోతి, పీసీ ఇంచార్జ్ రామచంద్రయ్య అన్నప్రసాదాలు ఘనంగా ఏర్పాటు చేశారు అనంతరం మండల కేంద్రమైన సిద్ధవటం పురాతనమైన కోటలోని, ముఖద్వారం, డంకానగర్, రాణి స్థానపుగట్ట రెండవ ముఖద్వారం వంటి అపురూపమైన కట్టడాలను తిలకించారు ఈ సందర్భంగా ఆయన సిద్ధవటం లో శనివారం మాట్లాడుతూ శ్రీశైల దక్షిణ ముఖ ద్వారమైన సిద్ధవటం మహా పుణ్యక్షేత్రమని సిద్ధులు, రాజులు నవాబులు పరి పాలించారని తెలిపారు అనంతరం రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య మన ఊరి స్వచ్ఛంద సేవా సంస్థ రవికుమార్, తెలుగు అధ్యక్షులు సుధీర్, బూత్ కన్వీనర్ ఉప్పల రామకృష్ణ, తదితరులు ఆయనను ఘనంగా సత్కరించార ఈ కార్యక్రమంలో పరమాత్మ సేవా ట్రస్ట్ చైర్మన్ మలిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు